- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ : వీటీడీఏ హెచ్చరిక
పెండింగ్ బిల్లులు రాకపోవడంతో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, నేరడిగొండ : మండలంలోని పెండింగ్ బిల్లులు రాకపోవడంతో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుల భారం తట్టుకోలేక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గ్రామాభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి అప్పుల ఊబిలో చిక్కుకున్న సర్పంచుల బాధలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేపట్టనున్న పిప్పిరి పర్యటనను అడ్డుకుంటామని వీటీడీఏతో పాటు లైవ్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ జాదవ్ హెచ్చరించారు. ఆదివారం గ్రామ సర్పంచ్ కళ్యాణి మహేందర్ జాదవ్ తెలిపారు.
అప్పుల ఊబిలో సర్పంచులు ఉన్నారని, గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు పూర్తి చేసి, ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఎదుర్కొంటున్నారని మహేందర్ జాదవ్ తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజల ఆశలు నెరవేర్చాలని సర్పంచులు సొంత డబ్బులు ఖర్చు చేసి, బ్యాంకులు నుండి అంతేకాకుండా వ్యక్తుల వద్ద అప్పులు తీసుకుని పనులు పూర్తి చేశారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పుల భారం మరింత పెరిగిందన్నారు. అప్పులు తీర్చలేక సర్పంచుల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయని, కొందరు సర్పంచులు మానసిక ఒత్తిడికి గురై తీవ్రఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలువురు సర్పంచులు అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు బాధాకరమన్నారు.
ప్రజల మధ్య అవమానాలు ఎదుర్కొంటున్న సర్పంచులు..
నిధులు రాకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు, సరఫరాదారులు సర్పంచుల పై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఆలోచించి నిధులను విడుదల చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.






