- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామాజిక కార్యకర్త హఠాన్మరణం.. విషాదంలో నార్నూర్ మండలం
దిశ, నార్నూర్ : మాతంగ్ ఋషి సంస్కార కేంద్రం వ్యవస్థాపకులు, సహకార సంఘం రిటైర్డ్ ఉద్యోగి మండలంలోని తాడిహడప్నూర్ గ్రామానికి చెందిన సూర్యవంశీ పండరి గురువారం

X
దిశ, నార్నూర్ : మాతంగ్ ఋషి సంస్కార కేంద్రం వ్యవస్థాపకులు, సహకార సంఘం రిటైర్డ్ ఉద్యోగి మండలంలోని తాడిహడప్నూర్ గ్రామానికి చెందిన సూర్యవంశీ పండరి గురువారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మరణ వార్తతో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాణోత్ గజానంద్ నాయక్, దళితరత్న అవార్డు గ్రహిత నర్సింగ్ మోరే, నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. తన కవితలు రచనలతో సంస్కార,విద్యవంతమైన సమాజాన్ని నిర్మించుటకు కృషి చేశారని, ఆయన మృతి మాంగ్ సమాజానికి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రాఘాడ సానుభూతిని ప్రకటించారు.
Next Story






