- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవే పై పసికందు మృతదేహం లభ్యం
ఆదిలాబాద్ జిల్లాలోని హైవే పై ఓ మగ పసి కందు మృతదేహం లభ్యమైన అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది.

X
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని హైవే పై ఓ మగ పసి కందు మృతదేహం లభ్యమైన అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల సమీపంలో జాతీయ రహదారి పక్కన పడి ఉన్న పసి కందు మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ పసికందును అక్కడ ఎవరైనా కావాలనే వదిలేశారా..? లేదా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.
Next Story






