బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ గా దావ స్వాతి

by Ratna Kumari |

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ ఏడో వార్డు కౌన్సిలర్ దావ స్వాతి ఎన్నికయ్యారు.

బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ గా దావ స్వాతి
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ ఏడో వార్డు కౌన్సిలర్ దావ స్వాతి ఎన్నికయ్యారు. 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి సబ్ కలెక్టర్ మనోజ్ మున్సిపల్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎట్టకేలకు బెల్లంపల్లి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ జోక్యంతో చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబురాలు జ‌రుపుకున్నారు.

Next Story