- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురు కనిపించడం లేదు.. తండ్రి మృతి.. ఇంతకీ ఏమైనట్టు..?
కూతురు కనిపించకపోవడంతో 15 రోజుల నుంచి మనోవేదనకు గురైన తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన సంఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మడలంలోని పార్డి (బీ)గ్రామంలో జరిగింది.

దిశ, కుబీర్: కూతురు కనిపించకపోవడంతో 15 రోజుల నుంచి మనోవేదనకు గురైన తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన సంఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మడలంలోని పార్డి (బీ)గ్రామంలో జరిగింది. పోలీసులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పోనకంటి సాయినాథ్ (46) కూతురు రాణి 15 రోజుల క్రిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుండి సాయినాథ్ మనోవేదనకు గురయ్యాడు. అతిగా మద్యం తాగుతున్నాడు. గురువారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రిపూట వెతికినా జాడ తెలియలేదు. శుక్రవారం రోజున కౌలుకు చేస్తున్న పంట చేళ్ళోనే చెట్టుకు ఉరి వేసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది. మృతుడి కుమారుడు పొన్నకంటి బాలాజీ ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో తండ్రి ఆత్మహత్య చేసుకోవడం, కూతురు రాణి కనిపించకుండపోవవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.






