ఆదివాసి గ్రామాల్లో ముగిసిన దండారి ఉత్స‌వాలు

by Ratna Kumari |

దిశ‌, ఇంద్ర‌వెల్లి : ఆదివాసి గ్రామాల్లో గుస్సాడీ, దండారి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే దీపావ‌ళి పండుగ‌కు దాదాపు 10 రోజుల మంది భోగీ

ఆదివాసి గ్రామాల్లో ముగిసిన దండారి ఉత్స‌వాలు
X

దిశ‌, ఇంద్ర‌వెల్లి : ఆదివాసి గ్రామాల్లో గుస్సాడీ, దండారి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే దీపావ‌ళి పండుగ‌కు దాదాపు 10 రోజుల మంది భోగీ పూజ‌ల‌తో దండారి ఉత్స‌వాలు ప్రారంభం అవుతున్నాయి. కొల‌బోడీ పూజ‌లతో మండ‌ల ప‌రిధిలోని డోంగ‌ర్ గావ్, కేస్లాపూర్ వంటి ఆదివాసీ గ్రామాల్లో గుస్సాడీ దండారి ఉత్స‌వాల‌కు ముగింపు ప‌లికారు. ప్రతి గ్రామంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ వాయిద్యాలు, చాచోయ్, నృత్యం, కోలాటం, రేల పాటలు ప్రత్యేక గుస్సాడి వేషధారణతో ఆట పాటలతో కొనసాగాయి. ఈ వేడుకలకు ఆదివాసీ గోండు సంప్రదాయ పూజలు చేసి ముగింపు పలికారు. గ్రామ శివారులో ఉన్న ఇప్ప చెట్టు కింద ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ముగించారు. ఈ కార్యక్రమంలో పెందుర్ బాదు పటేల్, అర్క సెడ్మారావ్, పెందుర్ భీంజీ, రాము భీర్సావ్ పాల్గొన్నారు.

Next Story