- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత మొబైల్ ఫోన్ల పేరిట సైబర్ మోసం
పాత మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, ఆదిలాబాద్ : పాత మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ సమీపంలోని మహమ్మదీయ లాడ్జ్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని తనిఖీ చేయగా.. పని చేయని కీప్యాడ్ ఫోన్లు, మదర్‌బోర్డులు, బ్యాటరీలు, సాకెట్లు, చిప్‌లు లభించాయి. విచారణలో వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌కు చెందిన అస్ మహమ్మద్, అర్షాద్, మహబూబ్ అలీ, దిన్ మహమ్మద్‌లుగా గుర్తించారు. వీరు పాత ఫోన్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటి భాగాలను వేరు చేసి మరమ్మతు చేసిన ఫోన్లలో అమర్చడంతో పాటు, కస్టమర్ల డేటా, IMEI నంబర్లు సేకరించి బ్యాంకు అధికారులుగా నటిస్తూ OTPలు తీసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ తెలిపారు.






