అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం

by Taduka Kalyani |

జిల్లాలో అక్రమ కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ పోలీస్ అధికారులను గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు.

అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం
X

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో అక్రమ కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ పోలీస్ అధికారులను గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహించే వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే గత రెండు రోజులలో జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఈస్గాం పీఎస్ పరిధిలో 6. కాగజ్‌నగర్ లో3. కౌటాలలో 1. కేరమేరి లో 1. బెజ్జుర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో 1 చొప్పున కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఇస్ గాం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలపై రెండు ఎక్స్‌టార్షన్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Next Story