- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలుగుబంటి దాడిలో పశువుల కాపరికి తీవ్ర గాయాలు
by Batti.Sumithra |
ఎలుగుబంటి దాడిలో పశువుల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి.

X
దిశ.బెజ్జుర్ : ఎలుగుబంటి దాడిలో పశువుల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం దర్గా పళ్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి బొట్టు పెళ్లి సంతోష్, గురువారం పశువులను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఎలుగుబంటి పశువుల కాపరి పై దాడి చేసింది. ఎలుగుబంటి దాడి చేయడంతో పశువుల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. పశువుల కాపరిని పెంచికలపేట డిప్యూటీ రేంజ్ అధికారి ప్రభాకర్ సందర్శించారు. పశువుల కాపరి సంతోష్ కు కుడి కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుని మెరుగైన వైద్యం కోసం కాగజ్ నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Next Story






