మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి.. రహదారిపై రైతుల ధర్నా

by Jakkula.Mamatha |

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి.. రహదారిపై  రైతుల ధర్నా
X

దిశ,లక్ష్మణచాంద: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామంలో ఎన్ హెచ్ 61 రహదారిపై రైతులు తమ మొక్కజొన్న పంట చేతికి వచ్చి నెల రోజులు గడిచాయి గాని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులు తక్కువ ధరకే కొనుగోలు చేయడంతో రైతులు గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పక్క మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి లక్ష్మణచాంద మండలం లో ఏర్పాటు చేయలేదని మా మండలం ఏం పాపం చేసిందని రాజకీయ నాయకులను అధికారులను రైతులు ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. రైతుల ఆందోళన చేపట్టడంతో స్పందించిన అధికారులు మండల తహసీల్దార్ సరిత, ఏవో వసంత్ మార్క్ఫెడ్ నుంచి ఆదేశాలు వచ్చాయని కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Next Story