- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nirmal : నిర్మల్ చెక్‌డ్యామ్ పేల్చివేతలపై రేగుతున్న దుమారం
నిర్మల్(Nirmal) జిల్లాలోని స్వర్ణ వాగుపై గల సాకేర చెక్‌డ్యామ్(Sakera Check Dam)ను కూల్చివేతపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : నిర్మల్(Nirmal) జిల్లాలోని స్వర్ణ వాగుపై గల సాకేర చెక్‌డ్యామ్(Sakera Check Dam)ను కూల్చివేతపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Allola Indrakaran Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Aleti Maheswar Reddy) ఆదేశాలతో చెక్‌డ్యామ్‌ను అక్రమంగా పేల్చివేశారని మండిపడ్డారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.
సాకేర చెక్‌డ్యామ్ నిర్మాణం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, దీని కూల్చివేత వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందని ఇంద్రకరణ్ ఆరోపించారు. అయితే, బీజేపీ నేతలు ఈ ఆరోపణలను ఖండించారు. చెక్‌డ్యామ్ కూల్చివేతకు ఎమ్మెల్యే ఏలేటికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నారని వారు వాదిస్తున్నారు. ఈ చెక్‌డ్యామ్ కూల్చివేత వెనుక సాంకేతిక లోపాలు ఉన్నాయని, బ్యాక్ వాటర్ ముప్పుతో పలు కాలనీలు నీట మునిగే అవకాశం ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
అయితే నిర్మల్ జిల్లాలోని స్వర్ణ వాగుపై జీఎన్ఆర్ కాలనీ సమీపంలో ఉన్న చెక్ డ్యామ్‌ను ఇరిగేషన్ అధికారులు మే 29న బాంబులతో పేల్చివేశారు. వర్షాకాలంలో పలు కాలనీలకు పొంచి ఉన్న వరద ముప్పు నివారించేందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో ఈ పేల్చివేతలు జరిగాయి.






