- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాగజ్ నగర్ లో కల్తీ నీటిరాజ్యం
కొమరం భీమ్ జిల్లాలో గల్లీల్లో నిశ్శబ్దంగా సాగుతున్న కల్తీ మినరల్ వాటర్ కుంభకోణం ప్రజల ప్రాణాలను అక్షరాలా పణంగా పెడుతోంది.

దిశ, కాగజ్ నగర్ : కొమరం భీమ్ జిల్లాలో గల్లీల్లో నిశ్శబ్దంగా సాగుతున్న కల్తీ మినరల్ వాటర్ కుంభకోణం ప్రజల ప్రాణాలను అక్షరాలా పణంగా పెడుతోంది. మండుతున్న వేసవిలో దాహంతో అలమటిస్తున్న సామాన్యుడి గొంతులో విషమే పోస్తున్నట్లు కొన్ని దందాలు బయటపడుతున్నాయి. అనుమతులేమీ లేకుండా, నాణ్యతా ప్రమాణాలు లేకుండానే సడలింపులేని లాభాల కోసం వాటర్ ప్లాంట్ల పేరుతో కొందరు మృత్యు వ్యాపారం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
అసలు ఏం జరుగుతోంది...?
వాటర్ ప్లాంట్లలో వాడాల్సిన మల్టీ-గ్రేడ్ ఫిల్టర్లు, యాక్టివేటెడ్ కార్బన్ బెడ్లు ఏళ్ల తరబడి మార్చడం లేదు. ఫలితంగా బాక్టీరియా కలిగిన నీరే క్యాన్లలోకి వస్తోంది. నీరు తెల్లగా మెరవడానికి మనిషి ప్రాణాలకు హాని చేసే బ్లీచింగ్ పౌడర్ మరియు ఇతర ప్రమాదకర రసాయనాలను మోతాదుకు మించి వాడుతున్నారు. అందులో శరీరానికి అవసరమైన మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలను అసలు కలపకుండానే యాడెడ్ మినరల్స్ అని కొన్ని బ్రాండెడ్ వాటర్ బాటిల్లా స్టిక్కర్లు అంటించి మోసం చేస్తున్నారు.
నీరు చల్లగా ఉంటే అందులో ఉండే నాణ్యత లోపాలను ప్రజలు గమనించలేరని, అదే అదనుగా నాణ్యత లేని నీటిని కూలింగ్ క్యాన్లలో క్యాన్లలో నింపుతున్నారు. అధికారులారా.. ఇప్పటికీ ఆయన నిద్ర లేవండి. ఈ కల్తీ దందా ఇంత బహిరంగంగా సాగుతున్నా, పర్యవేక్షించాల్సిన అధికారులు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారా అనే ప్రశ్నలు ప్రజలు తలెత్తుతున్నారు. గల్లీల్లో వెలుస్తున్న ప్లాంట్లకు కనీసం ట్రేడ్ లైసెన్స్ గానీ , అనుమతి గానీ లేకుండా విచ్చల విడిగా సాగుతూ ఉన్న ఈ వాటర్ ప్లాంట్ల ను ఫుడ్ సేఫ్టీ అధికారులు కనీసం ఒక్కసారి కూడా ఈ ప్లాంట్లలో నీటి శాంపిల్స్ సేకరించిన దాఖలాలు లేవు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్లాంట్లపై చర్యలు తీసుకోకపోవడం అంటే, మీరు కూడా ఆ కల్తీ మాఫియాకు సహకరిస్తున్నట్లేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు అందరూ తాగే నీటిని కలుషితం చేయడం ప్రాణాతకం మాత్రమే కాదు.. నేరం. కేవలం కొన్ని వేల రూపాయల లాభం కోసం వేలాది మంది ప్రాణాలను పణంగా పెడుతున్న ప్లాంట్ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన సమయం వచ్చింది. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే అధికారులు మేల్కొని ఈ నీటి కల్తీ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలి. కలుషిత నీరు తాగి టైఫాయిడ్, టైఫాయిడ్, కలరా, కిడ్నీ వ్యాధులు పెరుగుతుండడం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఎవరైనా చనిపోయాకే అధికారులకు బుద్ధి వస్తుందా. అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే గల్లీల్లో నడుస్తున్న అనధికారిక వాటర్ ప్లాంట్లపై మెరుపు దాడులు నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలు లేని వాటిని సీజ్ చేసి, కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నీరు ప్రాణాధారం.. అది ప్రాణాంతకం కాకూడదు అని మండిపడుతున్నారు.






