నిర్మాణ పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మించే ప్రభుత్వ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి :  కలెక్టర్ కుమార్ దీపక్
X

దిశ‌, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మించే ప్రభుత్వ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మించే ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతుందన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 129.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. జిల్లా ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అతి త్వరలో చేరువ కానున్నాయని తెలిపారు. గుత్తేదారు నిర్మాణ పనులను వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచనలు చేశారు. పనుల్లో జాప్యం చేయకుండా త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Next Story