- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్
దిశ, లక్షెట్టిపేట : కాంగ్రెస్ ఎన్నికల పొత్తును విస్మరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ సీపీఐ స్థానాల్లో పోటీ చేయడం న్యాయం కాదని, కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జిల్లా

దిశ, లక్షెట్టిపేట : కాంగ్రెస్ ఎన్నికల పొత్తును విస్మరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ సీపీఐ స్థానాల్లో పోటీ చేయడం న్యాయం కాదని, కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్ధతు ఇచ్చిందన్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ కి సహకరించి పొత్తు ధర్మాన్ని పాటిస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ నేడు అభ్యర్థులను పోటీలో నిలిపి ద్వంద నీతిని ప్రదర్శించడం అన్యాయమన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా పోరాటాల ద్వారా పలు రకాల సమస్యలకు పరిష్కారం చూపుతున్న సీపీఐ పొత్తును కాంగ్రెస్ నాయకులు విస్మరించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు సీపీఐ మద్ధతు ఇచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాకుండా ప్రజలు జరుగుతున్న అన్ని రకాల పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారని తెలిపారు. దౌడపల్లి సర్పంచ్ అభ్యర్థి మేదరి దేవవరం మాట్లాడుతూ తాను సర్పంచ్ పోటీలో లేనంటూ అసత్య ప్రచారం చేస్తూ సీపీఐని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తన నిస్వార్ధ సేవలను, ప్రజలకు అందుబాటులో ఉంటే విధానాన్ని బట్టి న్యాయంగా ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు. ప్రజా క్షేత్రంలో తనకు ఆదరణ ఉందని, ఇండిపెండెంట్ వార్డ్ అభ్యర్థులు కూడా తనకు మద్ధతుగా ఉన్నారని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి, జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, ఏఐటీయూసీ నాయకులు రమణ రెడ్డి,నాయకులు దేవయ్య, మధుకర్, దేవేందర్, సత్తన్న, శాంతయ్య, శ్రీదేవి, విజయలక్ష్మి,శంకరయ్య, కిరణ్ పాల్గొన్నారు.






