- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress : కులగణన అభిప్రాయ సమావేశంలో రభస
by Sridhar Babu |
ఆసిఫాబాద్ జిల్లాలోని రోజ్ గార్డెన్ లో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కులగణన అభిప్రాయ సేకరణ సమావేశం ఆ పార్టీ కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది.

X
దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలోని రోజ్ గార్డెన్ లో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కులగణన అభిప్రాయ సేకరణ సమావేశం ఆ పార్టీ కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, కాంగ్రెస్ నేత శ్యాంనాయక్ వర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. ఆపై దాడులు చేసుకోవడంతో ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి. దాంతో పోలీసులు కల్పించుకొని శ్యాంనాయక్ వర్గీయులను సమావేశం నుంచి బయటకు పంపించారు. దీంతో వారు రోడ్డు పై బైఠాయించి విశ్వప్రసాద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Next Story






