- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
దిశ, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని డీసీసీ

దిశ, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. తొలుత గాంధీ,అంబేద్కర్ చిత్రపటాలకు పూజలు చేసిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి వందేమాతర గేయాన్ని ఆలపించారు. అనంతరం పలువురు నేతలు డీసీసీ అధ్యక్షుడిని ఘనంగా సత్కరించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. అంతర్గత విభేదాలకు తావివ్వకుండా పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి కార్యకర్తకు అన్ని విధాలా అండగా ఉంటూ సమస్యలను తెలుసుకుంటామని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కనబరిచిన దూకుడును రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడమ బోజ్జు పటేల్,మాజీ ఎంపీ సోయం బాపూరావు, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య,గండ్రత్ సుజాత, అడ్డి భోజారెడ్డి, సాజిద్ ఖాన్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి,సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు.






