‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది’: ఎమ్మెల్యే

by Kodari Anjali |

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది’: ఎమ్మెల్యే
X

దిశ, ఉట్నూర్: మహిళలపై చిత్త శుద్ది ఉంటే వెంటనే కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రమే ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి మద్దతి ఇస్తుందని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి వ్యతిరేకం కాదని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలసి ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వానికి మహిళలు అంటే గౌరవం ఉందానని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వా ఆయంలో దేశ ప్రధానిగా, రాష్ర్టపతిగా ఇతర హోదాలలో మహిళాలకు అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. మహిళల హక్కులను స్వార్థ రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ అంటు రాజకీయ డ్రామాలు అడుతుందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ చేస్తున్న తప్పుడు, దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే విధంగా బీజేపీ కావాలనే పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగంగానే ఈ అసత్య ప్రచారం సాగుతోందని పేర్కోన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయాన్ని గుర్తు చేశారు.

దేశ సమాఖ్య స్వరూపాన్ని బలహీనపరిచేలా..

అయినప్పటికీ మహిళా రిజర్వేషన్ల, నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్), పార్లమెంట్, శాసనసభ స్థానాల పెంపుతో ముడిపెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న స్థానాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తోందని పేర్కోన్నారు. డెలిమిటేషన్ పేరుతో చిన్న రాష్ట్రాల హక్కులను దెబ్బతీసేలా, దేశ సమాఖ్య స్వరూపాన్ని బలహీనపరిచేలా బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. మహిళా రిజర్వేషన్ వంటి కీలక అంశాన్ని కూడా కేవలం రాజకీయ లాభాల కోసం వాడుకుంటూ, దేశవ్యాప్తంగా ప్రజలను మోసం చేయడానికి బీజేపీ తన చీకటి రాజకీయ ఎజెండాను అమలు చేస్తోందని, ఈ ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్ జైవంత్ రావ్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు ఆత్రం తిరుపతి, ఘన్ పూర్ సర్పంచ్ ఆనంద్ రావ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మెస్రం భాగ్యలక్ష్మి, లింగంపల్లి చంద్రయ్య, మర్సుకొల తిరుపతి, జాదవ్ జగదీశ్, లాజర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story