మంత్రిని కలిసిన కాంగ్రెస్ నేతలు

by Batti.Sumithra |

బోథ్ నియోజకవర్గానికి అదనపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారితో కలిసి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ కోరారు.

మంత్రిని కలిసిన కాంగ్రెస్ నేతలు
X

దిశ, నేరడిగొండ : బోథ్ నియోజకవర్గానికి అదనపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారితో కలిసి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ కోరారు. బోథ్ నియోజకవర్గ ప్రజల గృహ సమస్యలను పరిష్కరించేందుకు అదనపు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అవసరమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద, అవసరమైన కుటుంబాలు ఇంకా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నాయని, వారికి గృహ వసతి కల్పించడం అత్యవసరమని మంత్రికి వివరించారు.

ముఖ్యంగా అర్హులైన లబ్ధిదారులకు అదనపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. బోథ్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, మాజీ బోథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహదాస్, మాజీ ప్యాక్స్ డైరెక్టర్ చట్ల ఉమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, యువ నాయకుడు అలపాటి అచ్యుతానంద రెడ్డి, యండి సద్దాం, హీరా సింగ్, రాహిల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story