దుర్గామాత మండ‌పాల‌ను సంద‌ర్శించిన కాంగ్రెస్ నేత

by Ratna Kumari |

దిశ, ఆదిలాబాద్ : దేవీ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ కాల‌నీలో ప్ర‌తిష్టించిన దుర్గామాత మండ‌పాల‌తో పాటు

దుర్గామాత మండ‌పాల‌ను సంద‌ర్శించిన కాంగ్రెస్ నేత
X

దిశ, ఆదిలాబాద్ : దేవీ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ కాల‌నీలో ప్ర‌తిష్టించిన దుర్గామాత మండ‌పాల‌తో పాటు మావ‌ల‌, వాఘాపూర్, బ‌ట్టి సావ‌ర్గం, దుబ్బ‌గూడలో ప్ర‌తిష్టించిన దేవీ మండ‌పాల‌ను కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అమ్మ‌వారికి మ‌నం సేవ చేస్తే.. అమ్మ‌వారి ఆశీస్సులు ఎల్ల‌వేళ‌లా త‌మ‌కు ఉంటాయ‌ని తెలిపారు. అమ్మ‌వారి కృప క‌టాక్షాల‌తో ప్ర‌జ‌లు అంతా సుఖ‌, సంతోషాల‌తో ఉండాల‌ని.. ఆనంద‌మైన జీవ‌నాన్ని గ‌డ‌పాల‌ని కోరారు. విజ‌య‌ద‌శ‌మి పండుగ‌ను అంద‌రూ విజ‌యవంతంగా జ‌రుపుకోవాల‌ని సూచించారు. ప్ర‌జ‌లంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు.

Next Story