- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ డ్రామా : ఎమ్మెల్యే పాయల్ శంకర్
దిశ, ఆదిలాబాద్ : బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ రాజకీయ డ్రామా ఆడుతోందని, జీవో నంబర్ 9 హైకోర్టు స్టే ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి కారణమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే

దిశ, ఆదిలాబాద్ : బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ రాజకీయ డ్రామా ఆడుతోందని, జీవో నంబర్ 9 హైకోర్టు స్టే ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి కారణమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ అని ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ చేతగాని తనాన్ని వేరే పార్టీల మీదకు నెట్టడానికి ప్రయత్నిస్తుందని, న్యాయ పరమైన చిక్కులు వస్తాయని ముందే చెప్పామని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీసీలను పావుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని, ఏమి కాకముందే కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని, అప్పటివరకు బీసీల పక్షాన తాము పోరాడుతామని వెల్లడించారు.






