- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీలకు కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయి : ఆర్.ఎస్. ప్రవీన్ కుమార్
దిశ, ఆసిఫాబాద్ : బీసీ సోదరులను కాంగ్రెస్ బీజేపీలు నమ్మించి మోసం చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక నాయకులతో

దిశ, ఆసిఫాబాద్ : బీసీ సోదరులను కాంగ్రెస్ బీజేపీలు నమ్మించి మోసం చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక నాయకులతో కలిసి జీవో 9 పై హైకోర్టు స్టే విధించడంతో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీసీల పై కుట్రతోనే రేవంత్ సర్కార్ ఆగ మేఘాల మీద షేడ్యూల్ విడుదల చేసిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయం రేవంత్ రెడ్డి సర్కారుతో పాటు కేంద్రంలోని పెద్దలకు ఈ విషయం ముందే తెలుసని..! అయినా కావాలనే బీసీ రిజర్వేషన్ పేరుతో ఈ జీవో తెచ్చి వారికి అన్యాయం చేశారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పై కేసులు పెట్టేందుకు గవర్నర్ సంతకాలకు ముందున్న కాంగ్రెస్ నాయకులు.. బీసీ బిల్లు పై ఎందుకు సంతకాలు చేయించ లేదని ప్రశ్నించారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్న.. కేంద్రంతో బీసీ నాదంపై ఒత్తిడి ఎందుకు చేయలేదని నిలదీశారు. బీసీలకు జరిగిన మోసాన్ని ఖండిస్తున్నామని. ఈ వ్యవహారం పై పోరాటం చేస్తే బీసీలకు అండగా ఉంటామని చెప్పుకొచ్చారు.






