- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి అభినందనలు.. ఎంపీ సోయం బాపూరావు
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి, సహచర మంత్రివర్గానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు గురువారం అభినందనలు తెలిపారు.

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి, సహచర మంత్రివర్గానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు గురువారం అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ నుండి ఎంపీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రజల సంక్షేమం పట్టించుకోలేదని, మార్పు కోసం ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించారని అన్నారు.
కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, ముఖ్యంగా ఇంద్రవెల్లి స్మారక వనాన్ని ఏర్పాటు చేసి, ఆదివాసుల హక్కులను కాపాడాలని కోరారు. ఆదివాసీల ప్రధాన సమస్య అయిన పోడు భూములకు పట్టాలు, మారుమూల గ్రామాలకు రోడ్లు, తాగునీరు, సాగునీరు మౌలిక వసతులు కల్పించాలని ఎంపీ కోరారు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారన్న ఆశ ప్రజల్లో ఉందని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని కోరారు.






