ఎన్నికలను వేలం పాట ద్వారా నిర్వహించడం చట్టరీత్యా నేరం : ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్

by Nallavelli.Anjaneyulu |

దిశ, బోథ్ : రానున్న పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం బోథ్ నియోజకవర్గం లోని పలు

ఎన్నికలను వేలం పాట ద్వారా నిర్వహించడం చట్టరీత్యా నేరం : ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్
X

దిశ, బోథ్ : రానున్న పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం బోథ్ నియోజకవర్గం లోని పలు సున్నితమైన గ్రామాలైన సోనాల, కనుగుట్ట, కౌట - బి. ధన్నూర్, బి.బోథ్ గ్రామాలను సందర్శించి ఎస్పీ ప్రజలతో మాట్లాడుతూ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరి బలవంతం ఓటు పై ఉండకూడదని అన్నారు. ఎన్నికలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయకూడదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను పెట్టిన వారిపై పోలీసు చర్యలు తప్పవన్నారు. ఇటీవల బోథ్ మండలానికి చెందిన ఓ యువకుడికి అగ్ని వీర్ లో ఉద్యోగం వచ్చిందని కానీ అతని పై కేసు ఉండడం తో ఉద్యోగం కోల్పోయాడని కావున యువకులు కేసులలో ఇరుక్కొని బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని యువకులకు సూచించారు.ఎన్నికలను వేలంపాట ద్వారా నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని, వీడీసీల జోక్యం ఎన్నికలలో ఉండకూడదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు, 200 మీటర్ల వద్ద సూచించబడిన నియమాలను పాటించాలని తెలిపారు. గొడవలకు, అల్లర్లకు దూరంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా డయల్ 100 ద్వారా పోలీసు సహాయాన్ని సంప్రదించాలని తెలిపారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. ఎన్నికల సభలకు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.ఎన్నికలలో ఓటుకు మద్యం, బహుమతులు ఇవ్వడం నేరం అని, ఎక్కడైనా అక్రమ మద్యం పంచుతున్నట్లు సమాచారం ఉన్న డయల్ 100 ద్వారా సమాచారం అందించాలన్నారు. ఎన్నికలలో సమస్యలు సృష్టించే వారిని బైండోవర్ చేయడం జరుగుతుందని తెలిపారు. సోనాల, బోథ్ గ్రామాలలో ప్రత్యేక స్పెషల్ పార్టీ బలగాల చే ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, బోథ్ సీఐ డి గురు స్వామి, ఎస్సై సాయి సిబ్బంది పాల్గొన్నారు.

Next Story