- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధ్యాయుడు కించపరిచేలా మాట్లాడరని ఆందోళన
దిశ, ఆదిలాబాద్ : విద్యార్థిని కించపరిచేలా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట తల్లితండ్రులు, కాలనీ వాసులు ఆందోళన చేపట్టడం స్థానికంగా

దిశ, ఆదిలాబాద్ : విద్యార్థిని కించపరిచేలా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట తల్లితండ్రులు, కాలనీ వాసులు ఆందోళన చేపట్టడం స్థానికంగా చర్చానీయంశమయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ పట్టణంలోని రణదివేనగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఎం.డీ యూనుస్ పదోతరగతి విద్యార్థిని, సామాజిక వర్గం పేరిట, కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడారని.. తెలుసుకుని విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చేపట్టారు. తమను కించపరిచే విధంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఇంచార్జ్ డీఈవో, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎంఈవో సోమయ్య విచారణ చేపట్టారు.ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్టు ఇన్చార్జి డీఈఓ రాజేశ్వర్ ప్రకటించడంతో కాలనీ వాసులు శాంతించారు. ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిందర్ తెలిపారు.






