- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లెల్లో స్థానిక జాతర...దావతులు షురూ..!
దిశ, మామడ : స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో ఎటు చూసిన జన జాతరనే కనిపిస్తుంది. ఏ గ్రామంలోకి వెళ్లిన ప్రధాన కూడళ్లు, హోటల్స్, దుకాణాల వద్ద

దిశ, మామడ : స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో ఎటు చూసిన జన జాతరనే కనిపిస్తుంది. ఏ గ్రామంలోకి వెళ్లిన ప్రధాన కూడళ్లు, హోటల్స్, దుకాణాల వద్ద రాజకీయ ముచ్చట్లు వినిపిస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే టికెట్ల కోసం ఒకే ఇంటి నుంచి ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేస్తే ఏదో ఒకటి తమను వరిస్తుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు. మరోవైపు తాము పోటీ చేయాలనుకుని స్థానాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థి హోటల్స్ వద్దకు వెళ్లి వారికి ఛాయా, టిఫిన్స్ తినిపించడంతో పాటు రాత్రికి మందు కోసం రూ.100 ఇస్తున్నట్లు సమాచారం.
ఒకే పార్టీ నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల కోసం మూడు లేదా నలుగురు అభ్యర్థుల పేర్లను తమ తమ అధిష్టానికి పంపించారు. కొరటికల్, మామడ, పొన్కల్ గాయిద్ పల్లి గ్రామాలకు చెందిన బాపురెడ్డి, రాందాస్, రాజారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లు జడ్పీటీసీ గా.. సర్పంచులుగా నవీన్, సురేష్, భాగ్యలక్ష్మి, కమల, స్వరూప, వినోద పేర్లు వినిపిస్తున్నాయి. సుమారు నెల రోజులు అభ్యర్థులకు ఖర్చులు అధికమయ్యే అవకాశాలున్నాయి. ఆయా గ్రామాల్లో పోటీ చేసి అభ్యర్థులు ఓటర్ల నమస్తే...అంటూ పలకరిస్తున్నారు . గ్రామంలో ఉండి ఇన్ని రోజులు తనను పలకరించని వ్యక్తి ఎన్నికలు వస్తున్నాయంటే ఇలా పలకరిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థులు ఓటర్ నాడిని పసిగట్టాలంటే పైసలు ఖర్చు పెట్టాల్సిందే అని స్పష్టంగా తెలుస్తోంది.






