బోగస్ ఓట్ల తొలగింపుకు ఇదే మంచి అవకాశం: ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

by Kodari Anjali |

ఎస్. ఐ. ఆర్. ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు.

బోగస్ ఓట్ల తొలగింపుకు ఇదే మంచి అవకాశం: ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
X

దిశ, భైంసా: ఎస్ఆర్ఐ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాల వారిగా అందరి ఓట్లు నమోదు చేయించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. గురువారం బైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సర్ ప్రక్రియపై బిజెపి నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశీయులు దేశంలో చొరబడకుండా, ఉండటానికి సర్ ఎంతోగానో దోహదం చేస్తుందని భోగస్ ఓట్ల తొలగింపుకు ఇది మంచి అవకాశం అన్నారు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్. ఐ. ఆర్. లో గ్రామాల వారిగా బిఎల్వోలకు బిజెపి బిఎల్ఎ లు సహకరించాలన్నారు. భైంసాతో పాటు కుబీర్, ముధోల్, తానుర్, బాసర మండల కేంద్రంల్లో పెద్ద మొత్తంలో భోగస్ ఓట్లు ఉన్నాయని ఎస్. ఐ. ఆర్. తో అంతా తేటతెల్లమవుతుందన్నారు.

పెద్ద మొత్తంలో బోగస్ ఓట్లు ఉన్నాయి..

ఏవైనా అనుమానాలు ఉంటే, అధికారులను సంప్రదించాలని, అర్హులైన వారి ఓటు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత బిజెపి నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షులు రితిష్ రాథోడ్ మాట్లాడుతూ సర్ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని, సర్ తో పశ్చిమ బెంగాల్ లో 90 లక్షల బోగస్ ఓట్లు తొలగించబడ్డ విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సైతం పెద్ద మొత్తంలో బోగస్ ఓట్లు ఉన్నాయని, దేశం కోసం ధర్మం కోసం, నాయకులు కార్యకర్తలు అంతా కంకణ బద్దులై సర్ కు సహకరించాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో బిజెపి ఎస్. ఐ. ఆర్. జిల్లా ఇంచార్జి రావుల రాంనాథ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, ముధోల్ నియోజకవర్గ బిజెపి సర్ ఇంచార్జ్ పైడిపల్లి గంగాధర్,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్, ఏనుపోతుల మల్లేష్, పట్టణ బీజేపీ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Next Story