- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడే సకారాం ఫౌండేషన్ సేవలు భేష్..
దిశ, బోథ్ : ఆడే సకారాం ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ అన్నారు.ఆడే సకారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేరడిగొండ

X
దిశ, బోథ్ : ఆడే సకారాం ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ అన్నారు.ఆడే సకారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామంలో ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు రూ.4లక్షలతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆడే గజేందర్ ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ క్రాంతి కుమార్, ఆడే సతీష్ నాయక్ గతంలో బొందిడి గ్రామంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా శ్రీకృష్ణ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ క్రాంతి కుమార్ తరచూ వివిధ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు సేవలందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఆడే శీల, డాక్టర్ రజిత, ఆడే పరశురాం నాయక్ పాల్గొన్నారు.
Next Story






