మనఊరు - మనబడి పనులు వేగవంతం చేయాలి - కలెక్టర్ ముషారఫ్ అలీ

by Disha Web |
మనఊరు - మనబడి పనులు వేగవంతం చేయాలి - కలెక్టర్ ముషారఫ్ అలీ
X

దిశ, నిర్మల్ కల్చరల్ : మనఊరు - మనబడి, మనబస్తి - మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక వసతుల, పనులు వేగవంతం చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్ లో బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, సర్పంచులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మనఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలకుంటున్నారన్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో మొదటి విడతగా 260 పాఠశాలలను ఎంపిక చేసుకుని 178 పాఠశాలల్లో రూ .30 లక్షలలోపు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 15 శాతం నిధులు మంజూరుచేశారని, మండలానికి రెండు చొప్పున 38 మోడల్ పాఠశాలలు ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. పాఠశాలల్లో మేజర్, మైనర్ పనులకు సంబంధించిన నిధులు ప్రధానోపాధ్యాయుల అకౌంట్లో జమ చేసామని ఆయన పేర్కొన్నారు. కానీ పలుచోట్ల పనుల్లో జాప్యం జరుగుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో వేగం పెంచాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఈఓ రవీందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed