ఉట్నూర్‌లోని పోస్టల్ బ్యాలెట్‌ను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

by Bhanu |

మొదటి విడతలో 11న జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ యువరాజ్ మర్మట్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు.

ఉట్నూర్‌లోని పోస్టల్ బ్యాలెట్‌ను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, ఉట్నూర్: మొదటి విడతలో 11న జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ యువరాజ్ మర్మట్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఎన్నికల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ పూర్తి అయిన అనంతరం బాక్స్ లను బద్రపరుచు విషయాలతో పాటుగా పోలింగ్ సిబ్బందికి అందించే మెటీరియల్ పై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. 11న మొదటి విడతలో నిర్వహించే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రామ్ ప్రసాద్, తహశీల్దార్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.

Next Story