నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:కలెక్టర్ రాజార్షి షా

by Bhanu |

మే 4న జరగనున్న యూజీసీ-నీట్ పరీక్షకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులకు ఆదేశించారు.

నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:కలెక్టర్ రాజార్షి షా
X

ఆదిలాబాద్, దిశ: మే 4న జరగనున్న యూజీసీ-నీట్ (UGC-NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులకు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ రాజార్షి షాతో పాటు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, విద్యా, వైద్య శాఖ అధికారులు, పలువురు ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మే 4వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు, నిరంతర విద్యుత్, శానిటేషన్, తరగతి గదుల శుభ్రత, బెంచీలు, బస్ సదుపాయం వంటి మౌలిక సదుపాయాలన్నీ ఈ నెల 30వ తేదీ లోపు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ అశోక్, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రిన్సిపల్స్ హాజరయ్యారు.

Next Story