- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > హోమియోపతి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ కుమార్ దీపక్
హోమియోపతి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ కుమార్ దీపక్
దిశ, మంచిర్యాల : జాతీయ ఆయూష్ పథకంలో భాగంగా ఈనెల 13న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న హోమియోపతి

X
దిశ, మంచిర్యాల : జాతీయ ఆయూష్ పథకంలో భాగంగా ఈనెల 13న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో ఆయూష్ శాఖ, వైద్య శిబిరం ఇన్ చార్జీ డాక్టర్ సీ.హెచ్. స్పందన శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ కి అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ ఆయూష్ పథకం కింద ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హోమియోపతి వైద్య శిబిరం, ఆరోగ్య అవగాహన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కలెక్టర్ కుమార్ దీపక్.
Next Story






