- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్ కుమార్ దీపక్
దిశ, మంచిర్యాల : పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం

దిశ, మంచిర్యాల : పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా లోని నస్పూర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తరగతి గదులు, పాఠశాలలోని పలు రికార్డులను, రిజిస్టర్ ను పరిశీలించారు. అనంతరం పదో తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. కాసేపు పాటలు బోధించారు. పలు పాఠ్యాంశాల నుంచి విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల కోసం ఇప్పటినుంచే కష్టపడి శ్రద్ధగా చదువుకొని 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలను ఉపాధ్యాయులు గుర్తించి వారిపై పర్యవేక్షణ ఉంచాలన్నారు.పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన కూరగాయలతో భోజనం అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల ఎస్ఓ కు సూచించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించారు. జాతీయ రహదారి విస్తరణ, ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులను పరిశీలించారు. గ్రామాలలో అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు చేశారు.
విధి నిర్వహణ బాధ్యతగా నిర్వహించాలి..
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణ బాధ్యతగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిర్వహిస్తున్న విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో విజిలెన్స్ వారోత్సవాల గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 27 వ తేదీ నుండి నవంబర్ రెండవ తేదీ వరకు నిర్వహించనున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణ సమయస్ఫూర్తితో నిర్వర్తించాలన్నారు. అవినీతి అక్రమాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని అన్నారు.
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు..
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. డిసిపి భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, రెవెన్యూ, విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు కమిటీ తో పలు అంశాల పై ప్రస్థావించారు. హైదరాబాద్, కరీంనగర్, చంద్రపూర్, ఫైటింగ్, సిగ్నల్స్ బోర్డ్ ల ఏర్పాటుపై పర్యవేక్షించాలన్నారు. బాసర, లక్షట్ పేట్ రహదారులపై రాష్ట్రీయ రహదారి పై ప్రమాదాలు అధికంగా చోటు చేసుకోవడం జరుగుతుందని ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు.






