- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి : కలెక్టర్ కుమార్ దీపక్
దిశ, మంచిర్యాల: విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, మంచిర్యాల: విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్మించే ఇంటర్మీడియట్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారుకు సూచించారు. అనంతరం పాఠశాలలోని రిజిస్టర్ లను, పలు రికార్డులను తనిఖీ చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం దిశగా మెనూ ప్రవేశపెట్టిందన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన కూరగాయలతో విద్యార్థులకు భోజనం అందించాలని పాఠశాల నిర్వాహకులకు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎలాంటి సమస్య తలెత్తిన దృష్టికి తీసుకురావాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల కు ప్రత్యేక తరగతులు నిర్వహించి పదిలో ఉత్తీర్ణత శాతం పెరిగేలా బాధ్యత వహించాలన్నారు. అనంతరం తెలంగాణ ఆదర్శ పాఠశాల తో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల తోపాటు రేగులగుంట మల్కాపల్లి గ్రామాలలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. వంటశాల, ల్యాబ్, రిజిస్టర్ లను పరిశీలించారు.
జిన్నింగ్ మిల్లుల పరిశీలన...
జిల్లాలోని తాండూరు మండలం మహేశ్వరి, శ్రీరామ కాటన్ జిన్నింగ్ మిల్లులను పరిశీలించారు. ప్రెస్సింగ్ యూనిట్లను ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కపాస్ కిసాన్ యాప్ లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం పత్తిలో తేమశాతం ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జ్యోత్స్న, మండల వ్యవసాయ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.






