ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు : క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మంచిర్యాల : జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు, సమాచారం కొరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ పై  కంట్రోల్ రూమ్ ఏర్పాటు : క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్
X

దిశ, మంచిర్యాల : జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు, సమాచారం కొరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొదటి విడత ఎన్నికలలో 90 సర్పంచ్, 816 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణ కొరకు ఫ్లయింగ్, స్టాటిస్టిక్, సర్వేయలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, ఎంసీసీ, ఇతర ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ బృందాలను, అధికారులను నియమించిన‌ట్టు తెలిపారు. ప్రజలను ప్రలోభపెట్టే నగదు, మద్యం, కానుకల పంపిణీ, ప్రచారం, అక్రమ నగదు రవాణా అంశాలపై నిఘా పటిష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై సమాచారం ఇవ్వడానికి కంట్రోల్ రూమ్ నెంబర్ 08736 250501 కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇతర ఎన్నికల సంబంధిత సమాచారం కోసం సంప్రదించాలని సూచించారు.

Next Story