ఏజెన్సీ కోర్టు భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్

by Batti.Sumithra |

ఉట్నూర్ ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఏజెన్సీ కోర్టు భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు.

ఏజెన్సీ కోర్టు భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్
X

దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఏజెన్సీ కోర్టు భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏజెన్సీ కోర్టు సముదాయాన్ని ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ తో కలిసి సందర్శించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోనీ రికార్డు గది, కంప్యూటర్ గది, వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి తిరిగి ఈ కోర్టును ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, న్యాయవాదులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story