ఆక‌స్మిక‌ తనిఖీలతో హడలెత్తిస్తున్న క‌లెక్ట‌ర్ హ‌రిత

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-05 08:55:02  IST  )

కలెక్టర్ కే.హరిత ఆకస్మిక తనిఖీతో జిల్లా అధికారులను హడలెత్తిస్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 15 రోజుల్లోనే కలెక్టరేట్ లోని వివిధ కార్యాలయాలను మూడుసార్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఆక‌స్మిక‌ తనిఖీలతో హడలెత్తిస్తున్న క‌లెక్ట‌ర్ హ‌రిత
X

దిశ, ఆసిఫాబాద్ : కలెక్టర్ కే.హరిత ఆకస్మిక తనిఖీతో జిల్లా అధికారులను హడలెత్తిస్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 15 రోజుల్లోనే కలెక్టరేట్ లోని వివిధ కార్యాలయాలను మూడుసార్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులు సమయపాలన పాటిస్తూ.. పారదర్శకంగా విధులు నిర్వహించాలని.. లేని యెడ‌ల‌ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల నర్సింగ్ కళాశాల తనిఖీ చేసిన సమయంలో వార్డెన్ వినోద అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ లో అందుబాటులో లేకపోవడంతో పాటు బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. తాజాగా గురువారం జిల్లా కేంద్రంలోని వివిధ శాఖల కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయగా ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ ఫీల్డ్ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్న రాకేష్ అనే ఉద్యోగి తన స్థానంలో ప్రైవేటు వ్యక్తిని నియమించి తన విధులను చేయించడం కలెక్టర్ సాక్షిగా బ‌ట్టబయలు అయింది. దీంతో పాటు మరో కార్యాలయంలో పట్టపగలు విద్యుత్ దీపాలు వెలగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ లైట్లు స్విచ్ ఆఫ్ చేసేందుకు సమయం లేకపోతే తనకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే.. నేనే వచ్చి లైట్లు ఆఫ్ చేస్తానని ఆ అధికారుల పని తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పరిపాలన పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రక్షాళన మొదలుపెట్టడంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

Next Story