వైద్య సిబ్బంది గైర్హాజరు పై కలెక్టర్ ఆగ్రహం..

by Batti.Sumithra |

కాగజ్ నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆదివారం జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీ చేశారు.

వైద్య సిబ్బంది గైర్హాజరు పై కలెక్టర్ ఆగ్రహం..
X

దిశ, ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆదివారం జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీ చేశారు. పలువురు వైద్యసిబ్బంది గైర్హాజరు ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలతో పాటు వార్డులు, రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆ తర్వాత 62 వో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి. ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహణ తీరును బూత్ స్థాయి అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు, మార్పులు చేర్పులు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కాగజ్ నగర్ కేంద్రీయ విద్యాలయంతో పాటు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.

Next Story