బెజ్జూర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

by Batti.Sumithra |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించి, వైద్య సేవల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బెజ్జూర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
X

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించి, వైద్య సేవల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, తహశీల్ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాలను పరిశీలించారు.

పాఠశాలల్లోని రికార్డులను తనిఖీ చేసి, విద్యార్థుల వసతుల పై ఆరా తీశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని కూడా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తహశీల్ కార్యాలయంలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహశీల్దార్ రామ్మోహన్ రావుకు ఆదేశించారు. మండల సమస్యలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో బి.ఎస్. ప్రవీణ్ కుమార్, కార్యదర్శి వైకుంఠం, స్థానిక సర్పంచ్ సరోజ, ఉపసర్పంచ్ ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story