నిర్మల్ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

by velandi.Saikiran |

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్ణయం తీసుకున్నారు.

నిర్మల్ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
X

దిశ ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం పరిశీలించారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో అన్ని ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉధృతి నేపథ్యంలో ఆమె వెంటనే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో స్వర్ణ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, పంచాయతీ, ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

విద్యాసంస్థలకు సెలవు...

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నేపధ్యంలో గురువారం నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్ణయం తీసుకున్నారు.

Next Story