- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం సభ గ్రాండ్ సక్సెస్.. డీసీసీ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్
పిప్పిరిలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ అపూర్వ విజయాన్ని సాధించిందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజార్హత్నూర్ మండలం పిప్పిరిలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ అపూర్వ విజయాన్ని సాధించిందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభను విజయవంతం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పిప్పిరి సభా వేదికగా ముఖ్యమంత్రి ఆదిలాబాద్ అభివృద్ధికి అనేక కీలక హామీలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల స్థాపన, కుప్టి ప్రాజెక్ట్ పనుల పూర్తి, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుందని అన్నారు. జూన్ 2లోపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, కేంద్ర నిధుల కోసం స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముందంజలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.






