రేపు ఆదిలాబాద్ జిల్లాకి సీఎం రేవంత్ రెడ్డి రాక‌.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

by Ratna Kumari |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, ఎటువంటి లోటుపాట్లు ఉండొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల అన్నారు.

రేపు ఆదిలాబాద్ జిల్లాకి  సీఎం రేవంత్ రెడ్డి రాక‌.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
X

దిశ‌, మామ‌డ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, ఎటువంటి లోటుపాట్లు ఉండొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల అన్నారు.శుక్రవారం మండలంలోని పొన్కల్ సదర్ ఘాట్ బ్యారేజ్ ప్రారంభోత్సవానికి సీఎం రానున్నారు . దీంతో గురువారం కలెక్టర్, ఎస్పీ, ముఖ్యమంత్రి ప్రత్యేక సిబ్బంది బ్యారేజ్, హెలిప్యాడ్, గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడానికి ఉపయోగించే రిమోట్ స్విచ్ తదితర వాటిని పరిశీలించారు. కేవలం 20 మంది మాత్ర‌మే బ్యారేజ్ వద్దకు అనుమతి ఉందని.. వాహనాలను పార్కింగ్ ప్రాంతంలోని నిలిపివేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి , ఏఎస్పి సాయికిరణ్, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ గోవర్ధన్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story