గంజాయి విక్ర‌యాలు జ‌రిపితే క‌ఠిన చ‌ర్య‌లు: సీఐ అజ‌య్

by Ratna Kumari |

దిశ, ఖానాపూర్ : నిషేధ గంజాయి విక్రయాలు జరిపితే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ఖానాపూర్ సీఐ సీహెచ్ అజయ్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోను సదర్మాట్ కాలువ

గంజాయి విక్ర‌యాలు జ‌రిపితే క‌ఠిన చ‌ర్య‌లు: సీఐ అజ‌య్
X

దిశ, ఖానాపూర్ : నిషేధ గంజాయి విక్రయాలు జరిపితే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ఖానాపూర్ సీఐ సీహెచ్ అజయ్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోను సదర్మాట్ కాలువ సమీపంలోనూ నిషేధ గంజాయి విక్రయాలు జరుపుతుండ‌గా ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ అజయ్ వివ‌రాల‌ను వెల్లడించారు. ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన పుట్ట మనోహర్, సుభాష్ నగర్ కాలనీకి చెందిన భోదాసు రాము అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారంతో వారిద్దరిని పట్టుకున్నట్టు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 3 కిలోల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసున్నామని, వారిని రిమాండ్ కు తరలించినట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఉన్నాడ‌ని అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటామని సీఐ వెల్లడించారు. నిషేధ గంజాయి కానీ విక్రయాలు జరిపినా.. వాటికి ప్రోత్సహించిన వారు ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు. విద్యార్థులు గంజాయికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి పండించినట్టు లేదా విక్రయించినట్లు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ గైక్వాడ్, రెండో ఎస్ఐ జ్యోతి పాల్గొన్నారు.

Next Story