బాల్యవిహాలు చట్టరిత్యా నేరం : మిష‌న్ శ‌క్తి జెండ‌ర్ స్పెష‌లిస్ట్ మౌనిక

by Ratna Kumari |

దిశ‌, ఖానాపూర్ : బాల్య వివాహాలు చ‌ట్ట రిత్యా నేర‌మ‌ని మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ మౌనిక అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలోని ప్రజా పరిషత్ పాఠశాలలో గురువారం

బాల్యవిహాలు చట్టరిత్యా నేరం : మిష‌న్ శ‌క్తి జెండ‌ర్ స్పెష‌లిస్ట్ మౌనిక
X

దిశ‌, ఖానాపూర్ : బాల్య వివాహాలు చ‌ట్ట రిత్యా నేర‌మ‌ని మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ మౌనిక అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలోని ప్రజా పరిషత్ పాఠశాలలో గురువారం బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు పూర్తి కాకముందు వివాహం చేయకూడదని.. ఒక‌వేళ అలా చేస్తే చట్టరిత్యా నేరమని ఆమె పేర్కొన్నారు. అనుసంధానం లోని గ్రామంలో బాల్య వివాహం చేసినట్లు తెలిస్తే వెంటనే 1098 కి ఫోన్ చేసిన సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బాలల హక్కుల రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుండాలన్నారు. అలాగే సఖీ సేవలను, చైల్డ్ లైన్ సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్ర‌ధానోపాధ్యాయుడు జీ.వి. వరప్రసాద్, సఖి కౌన్సిలర్ కవిత, సఖి కేసు వర్కర్ లావణ్య, చైల్డ్ లైన్ కౌన్సిలర్ సుప్రియ, చైర్మన్ నీలా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story