ప్రజలకు చేరువ కానున్న న్యాయ సేవలు : హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్

by Ratna Kumari |

దిశ, మంచిర్యాల : జిల్లా ప్రజలకు అన్ని రకాల న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో

ప్రజలకు చేరువ కానున్న న్యాయ సేవలు : హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్
X

దిశ, మంచిర్యాల : జిల్లా ప్రజలకు అన్ని రకాల న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంజూరైన నూతన కోర్టు భవన నిర్మానాణ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా భవన శిలాఫలకాన్ని ప్రారంభించారు. భూమి పూజను వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, గోమాత తో ప్రత్యేక పూజలను నిర్వహించారు. జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నాగేష్ బీమాపాక, ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, డిసిపి ఏ. భాస్కర్ లతో కలిసి శిలా పలకాన్ని ప్రారంభించారు. అనంతరం వర్చువల్ దృశ్య మాంధ్యమం లో వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికీ అన్ని రకాల న్యాయస్థాన సేవలు మరింత చేరువ కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కోర్టు అవసరాలకు సరిపడా సౌకర్యం లేకపోవడంతో న్యాయ సేవల కోసం వచ్చిన ప్రజలందరూ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని భారత న్యాయ నిర్మాణ వ్యవస్థ ద్వారా 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర బడ్జెట్ నిధులు తో రూ. 81 కోట్లతో కోర్టు నూతన భవన నిర్మాణ పనులకు మోక్షం కలిగిందన్నారు. అన్ని రకాల న్యాయ సేవలు అందుబాటులోకి రానున్నట్లు హర్షం వ్యక్తం చేశారు.

శ్రమ ఆయుధమైతే విజయం నీ బానిస

శ్రమ ఆయుధమైతే విజయం బానిస అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య అన్నారు. జిల్లా స్థాయిలో అన్ని రకాల న్యాయ సేవలు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఫోక్సో ఫ్యామిలీ కోర్టులను కలుపుకొని 10+2 నూతన కోర్టు భవనాన్ని నిర్మించడం ద్వారా ఒకే చోట అన్ని న్యాయ సేవలు లభిస్తాయన్నారు.2027 ఈ సంవత్సరం జూన్ మాసం నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి న్యాయ సేవలు ప్రారంభించాలన్నారు. అంతేకాకుండా గోదావరి నది తీరాన కేంద్రీకృతమైన మంచిర్యాల జిల్లాలో వరి, పత్తి, కూరగాయల పంటల సాగు తో పాటు లక్షట్ పేట లోని గూడెం సత్యనారాయణ స్వామి, బొక్కల గుట్ట గాంధారి ఖిల్లా ఆధ్యాత్మికతకు అద్దం పడుతుందన్నారు. శివ్వారం లో మొసళ్ళ అభయరణ్యం, సింగరేణి లో బొగ్గు తవ్వకాలతో పాటు విద్యుత్ ఉత్పాదకంతో జిల్లా లో అన్ని వనరులు ఇక్కడ ఉండడం విశేషం అన్నారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు, వినియోగదారుల ఫోరం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తే త్వరగతిన ఏర్పాటు చేసే విధంగా తమ వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు భవన నిర్మాణ పనులను సంబంధిత గుత్తేదారు నిర్ణిత సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించి పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. జిల్లాలో నూతన కోర్టు తో న్యాయ సేవలు మరింత చేరువ కానున్నట్లు తెలిపారు. కళావేదికపై ఏర్పాటు సాంస్కృతిక ఘట్టంలో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story