- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
23న చలో ఉట్నూర్ సభను జయప్రదం చేయండి : ఆదివాసీ మండల అధ్యక్షులు తిరుపతి
దిశ, బెజ్జూర్ : కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో మంగళవారంఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్లను

దిశ, బెజ్జూర్ : కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో మంగళవారంఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్లను ఆదివాసి నాయకులు. ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసి మండల అధ్యక్షులు కోరిత తిరుపతి మాట్లాడుతూ ఆదివాసి బచావో లంబాడా హటావో అనే ప్రధాన నినాదంతో ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే ఏకైక డిమాండ్ తో నవంబర్ 23న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో ఎంపీడీవో గ్రౌండ్ లో ధర్మ యుద్ధం పేరిట భారీ బహిరంగ సభను 9 తెగల ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నామని.. ఈ మహా సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిడం సాకారం, వ్యవస్థాపక అధ్యక్షులు కుర్సింగా ఓం ప్రకాష్, సర్మెడి కొడప శంకర్, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం బక్కయ్య, కోయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెస్రం రాజారాం, ఆదివాసీ మహిళ అధ్యక్షరాలు ఎనుకా అమృత, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మెడి సతీష్, ప్రచార కార్యదర్శి సడ్మేక రమేష్, మాజీ సర్పచులు కొమురం హన్మంతు, కర్పేత రమేష్, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల శ్యామ్ రావు, కొలవార్ మండల ఉపాధ్యక్షులు మనేపెళ్లి మల్లేష్, ఆదివాసీ నాయకులు కోరేత లలయ్య, ఆత్రం గంగారాం, ఆత్రం రాజారాం, పురుషోత్తం, నైతం సత్తయ్య, పేదం శ్రీహరి, ఏనుక శ్రీహరి, గెడం నందరం, కొడిపె వెంకటేష్, తోరెం వినోద్, సిడం షణ్ముఖ, జిల్లా సహాయక కార్యదర్శి పోల్కా వెంకటేష్, గవుడే గణేష్, సుదర్శన్ పాల్గొన్నారు.






