- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖానాపూర్, క్యాతన్ పల్లిలో ఇంకా తేలని చైర్మన్ల లెక్క
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల కార్పొరేషన్ సహా ఎనిమిది పురపాలక సంఘాలకు ఎన్నికలు పూర్తికాగా అన్నిచోట్ల చైర్మన్ వైస్ చైర్మన్ లు కొలువు దీరారు. కాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి పురపాలక సంఘాల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఇంకా కొలిక్కి రాలేదు.

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల కార్పొరేషన్ సహా ఎనిమిది పురపాలక సంఘాలకు ఎన్నికలు పూర్తికాగా అన్నిచోట్ల చైర్మన్ వైస్ చైర్మన్ లు కొలువు దీరారు. కాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి పురపాలక సంఘాల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ రెండు పురపాలక సంఘాల ఎన్నికలు ఇంకా ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఎన్నికలు వాయిదా పడగా... మూడోసారి ఎన్నికల తేదీని నేడో రేపో ప్రకటించనున్నారు. ఆలోపు అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా క్యాంపుల్లో ఉన్న భారత్ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ సిపిఐ పార్టీలు ఐక్యంగా ఉంటాయా..? పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తాయా..? అన్న సందేహం ఇప్పుడు రాజకీయ పార్టీలతో పాటు ఆ రెండు మున్సిపాలిటీల సామాన్య జనంలోనూ హాట్ టాపిక్ గా మారింది.
కుదరని సయోధ్య..
ఖానాపూర్ పురపాలక సంఘంలో అక్కడి శాసనసభ్యులు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ కు వ్యతిరేకంగా బిజెపి, బిఆర్ ఎస్ పార్టీలు కొట్లాడి నిలబడ్డారు ఆ పురపాలక సంఘంలో 12 స్థానాలకు గాను బిజెపి నాలుగు భారత రాష్ట్ర సమితి పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచింది అధికార కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలవగా వీరి బలం నాలుగు చేరింది. ఎక్స్ అఫీషియో ఓటుతో ఆ పార్టీకి 5 మంది సభ్యుల బలం ఉంది. అయితే మున్సిపల్ స్థానం నిలబెట్టుకునేంత సంఖ్య కాకపోవడంతో బిజెపి భారత్ రాష్ట్ర సమితి పార్టీలు కలిసి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని నిలుపుకుంటాయని భావించారు. అయితే ఆ రెండు పార్టీల నడుమ సయోధ్య లేక మరో ఎన్నికల తేదీ ప్రకటించినటికి ఎవరికి వారుగా వస్తే... అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. బిజెపికి టిఆర్ఎస్ సపోర్టు చేయడం పై సందేహాలతో ఉంది ఇప్పుడు బిజెపికి అండగా నిలిస్తే సాధారణ ఎన్నికల సమయం నాటికి ఎమ్మెల్యేగా తనకు మైనస్ అవుతుందని మైనార్టీలు వ్యతిరేకిస్తారని ఆ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ మధన పడుతున్నట్లు తెలుస్తుంది. కాగా బిజెపి నుంచి గెలిచిన కౌన్సిలర్లు ఎవరికి మద్దతు ఇవ్వవద్దని ప్రతిపక్షంలో ఉండాలని అక్కడి ఓటర్లు ఒత్తిడి చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాగజ్ నగర్ , బైంసా, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలలో జరిగిన బహిరంగ పొత్తుల ప్రకారం ఇక్కడ కూడా జరగడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని అధికార కాంగ్రెస్ పార్టీని నిలువరించినట్లు అవుతుందని... అధికార పార్టీని ఓడించడం ద్వారా ప్రతిపక్షాల బలం పెరుగుతుందన్న అభిప్రాయాలు కూడా ఆ విశ్లేషకులు ఉంది. ఇక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అంతుచిక్కడం లేదు.
క్యాతన్ పల్లి బిఆర్ఎస్ కమ్యూనిస్టులదే...
ఇక క్యాథన్ పల్లి పురపాలక సంఘం ఎన్నికల విషయానికి వస్తే ఆ సీటు భారత్ రాష్ట్ర సమితి సిపిఐ పార్టీల పొత్తుతో అధికారంలోకి రావడం ఖాయం గా కనిపిస్తున్నది. ఎన్నికల రోజు జరిగిన గొడవ కాస్త చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ జైలుకు వెళ్లేదాకా పరిణామాలు దారితీసాయి. రాజకీయంగా ఈ వ్యవహారం సుమన్ కు గట్టి మైలేజ్ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీ పై దింపుడు గల్లం ఆశలు పెట్టుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 10 మంది టిఆర్ఎస్, నలుగురు సిపిఐ సభ్యులు గెలవగా... కాంగ్రెస్ నుంచి ఏడు ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు పట్టుకున్న సంఖ్య పది దాటదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ఎవరైనా మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారా అన్నది తేలాల్సి ఉంది. రెండుసార్లు వాయిదా పడిన పురపాలక సంఘాల ఎన్నికల వ్యవహారం పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంటుందని మూడోసారి ఎంతమంది వచ్చినా వారికే అవకాశం ఇస్తారని చెబుతున్నారు. దీనిపై ఇంకా స్పష్టత లేదు. తాజా పరిణామాలు ఆ రెండు మున్సిపాలిటీల ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.






