- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం : ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్
దిశ, కాగజ్ నగర్ : ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన

దిశ, కాగజ్ నగర్ : ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన పీఎం జన్మన్ కింద ప్రత్యేకించి వెనుకబడిన గిరిజన సమూహాల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన కలెక్టర్ వెంకటేష్ దోత్రె, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ పీఎం జన్మన్ ద్వారా ప్రతి పేద గిరిజనుడికి ఇల్లు అందించడం లక్ష్యమన్నారు. ప్రస్తుత విడతలో ఇండ్లు మంజూరు కాని వారికి కూడా భవిష్యత్తులో తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి కోసం వారి గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటికే మల్టీపర్పస్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఎంపీ వివరించారు. ఈ కేంద్రాలలో అంగన్ వాడి సెంటర్, హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ వంటి అన్ని సేవలు ఒకే చోట లభిస్తున్నాయని తెలిపారు. పేద గిరిజనులకు ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో పీఎం జన్మన్ కింద మొత్తం 2169 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. వీటిలో అత్యధికంగా ఆసిఫాబాద్, తిర్యానీ మండలాల్లో మంజూరైనట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మీ మాట్లాడుతూ తమ మండలంలో 543 ప్రతిపాదనలు పంపగా.. 449 మంజూరయ్యాయని, మిగిలిన వాటిని కూడా మంజూరు చేయించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలలో దళారులను నమ్మి మోసపోకూడదని, ఎవరికీ వారుగా ఇండ్లు నిర్మించుకుంటేనే నాణ్యత ప్రమాణాలు బాగుంటాయని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీనారాయణ, హౌసింగ్ పీడీ ప్రకాష్, డీఈ వేణుగోపాల్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ పాల్గొన్నారు.






