అన్నదాతలకు అండగా కేంద్ర ప్రభుత్వం :

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆదిలాబాద్ : అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పాటు పడుతోందని ఎంపీ గోడం నగేష్,ఎమ్మెల్యే పాయల్ శంకర్

అన్నదాతలకు అండగా కేంద్ర ప్రభుత్వం :
X

దిశ, ఆదిలాబాద్ : అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పాటు పడుతోందని ఎంపీ గోడం నగేష్,ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.ఆదిలాబాద్ పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పీఎం ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మ నిర్భర్ ఇన్ పల్సేస్ ప్రాజెక్టులను లాంచనంగా ప్రారంభించారు. అంతకుముందు స్టాళ్ళను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షించారు.ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ పాటు పడుతున్నారని అన్నారు. అధునాతన సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులను పెంచండం, యాంత్రీకరణ తదితర అంశాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా.ఎన్.రామగోపాల వర్మ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, జిల్లా ఉద్యాన అధికారి నరసయ్య, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డా. రఘువీర్, డా.ఎం.సురేశ్, డా. జి.శివ చరణ్ పాల్గొన్నారు.

Next Story