- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారుల సమిష్టి కృషితోనే జిల్లాకు కేంద్ర అవార్డులు : కలెక్టర్ అభిలాష అభినవ్
దిశ ప్రతినిధి, నిర్మల్ : అధికారుల సమిష్టి కృషికి నిదర్శనంగానే అవార్డులు, రివార్డులు లభిస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇటీవల జిల్లాకు

దిశ ప్రతినిధి, నిర్మల్ : అధికారుల సమిష్టి కృషికి నిదర్శనంగానే అవార్డులు, రివార్డులు లభిస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇటీవల జిల్లాకు లభించిన ‘జల సంచాయ్ – జనభగిధరి’ అవార్డు సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల సంరక్షణలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రజల భాగస్వామ్యమే ఈ అవార్డుకు కారణం అన్నారు. లక్ష్యాలను సమయానికి చేరుకోవడమే కాకుండా, అమలు విధానంలో పారదర్శకత చూపడంతోనే రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాలో భూగర్భ జలాల సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వ ప్రాజెక్టులు, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలలో అధికారులు అద్భుతంగా పని చేశారని కొనియాడారు. ముందుముందు ఇదే ఉత్సాహం కొనసాగించాలని సూచించారు. పలువురు క్షేత్రస్థాయి ఉద్యోగులు మాట్లాడుతూ, అత్యల్ప సమయంలో సమర్థవంతంగా కార్యక్రమాలు పూర్తి చేయడానికి కలెక్టర్ మార్గనిర్దేశం ముఖ్య కారణమని తెలిపారు. అనంతరం కలెక్టర్ కేక్ కట్ చేసి, అవార్డు సాధనలో సేవలందించిన అధికారులకు శాలువాలు చుట్టి సన్మానం చేసి, జ్ఞాపికలను అందజేశారు. అనంతరం 18 ఫాగింగ్ యంత్రాలను మండల స్థాయిలో ఎంపీఓలకు కలెక్టర్ పంపిణీ చేశారు. వర్షాకాలంలో దోమల నిర్మూలనకు వీటిని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్‌డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, ఎంపీడీవోలు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






