- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్.. ఫీల్డ్ సర్వే పూర్తి చేసిన కేంద్ర-రాష్ట్ర అధికారులు
ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు అంశం కీలక దశకు చేరుకుంది.

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు అంశం కీలక దశకు చేరుకుంది. ఇటీవల కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి ఢిల్లీలో స్పష్టత ఇవ్వడంతో ఈ ప్రక్రియ వేగం అందుకుంది. ఇందులో భాగంగానే శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ, ఎయిర్ ఫోర్స్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి OLS ఫీల్డ్ సర్వే నిర్వహించారు. స్థానిక ఎరోడ్రం మైదానం, పరిసర ప్రాంతాలను పరిశీలించి పలు సాంకేతిక అంశాలపై చర్చించారు.ఈ సర్వేలో జేపీ సబర్వాల్, ఎస్.జీ ఇగ్డా, రాజీవ్ శాకుల్, కాత్యాయని, కల్నల్ నటరాజ్, ఎస్.కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వారికి స్థానిక పరిస్థితుల పై వివరాలు అందించారు.
జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయి ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు మొత్తం 1540 ఎకరాల భూమి అవసరమని అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలో 369 ఎకరాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాల భూసేకరణకు అంగీకరించింది. ఇంకా 700 ఎకరాల భూమి అవసరం ఉండటంతో మూతపడ్డ CCI ఫ్యాక్టరీ భూములను సేకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నివేదికను 20 రోజుల్లో కేంద్రానికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.అనంతరం మాస్టర్ ప్లాన్, భూ సేకరణకు సంబంధించిన తుది నిర్ణయాలను కేంద్రం ప్రకటించనుంది. రెండున్నర కిలోమీటర్ల పొడవు గల రన్‌వే, ATC టర్మినల్, ఆధునిక సదుపాయాలతో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఎయిర్ పోర్టుతో అభివృద్ధి దిశగా ఆదిలాబాద్: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తయితే జిల్లాకు అభివృద్ధి దిశగా కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భూ సేకరణలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, భూ నిర్వాసితుల అభిప్రాయాలను సేకరించి నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.






